Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ

అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ

- Advertisement -

ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ 
నవతెలంగాణ – పరకాల 
: పరకాల పట్టణంలో ఉన్న ప్రయివేట్ పాఠశాలలు విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ ఆరోపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎంఈఓ రమాదేవికి దీన్ని గురించి తెలిసినా.. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పరకాల పట్టణంలో విచ్చలవిడిగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నా.. కనీసం ప్రయివేట్ స్కూల్లో తనిఖీ చేయడం లేదని, స్కూల్ బస్సులో ఎక్కువమంది విద్యార్థులను తరలిస్తున్నప్పటీకి పట్టించుకోవడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా డీఈఓ వెంటనే స్పందించి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐపరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, సాయి విజయ్, అజయ్ మహేష్, రావణ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -