Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణలో పెద్ద కాంట్రాక్టులన్నీ చంద్రబాబు కోవర్టులకే: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో పెద్ద కాంట్రాక్టులన్నీ చంద్రబాబు కోవర్టులకే: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

- Advertisement -

లేఖలు రాసినంతమాత్రాన బనకచర్ల ఆగదు
చంద్రబాబు కోవర్టులకు, కాంట్రాక్టులకు కరెంటు కట్ చేయండిఔ
వాళ్లు చేసిన పనులకు బిల్లులు నిలిపి వేయండి
కోవర్టులను టైట్ చేస్తే వాళ్లే బాబు కాళ్లు పట్టుకొని బనకచర్ల ఆపేస్తారు
మంత్రి ఉత్తమ్ కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచన
నవతెలంగాణ – జడ్చర్ల
తెలంగాణ ప్రాంతానికి శాపంగా మారనున్న ఏపీ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలంటే లేఖలు రాసినంతమాత్రాన సరిపోదని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవర్టులను టైట్ చేస్తేనే ఆ ప్రాజెక్టు ఆగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాలానగర్ మండలం మోతీఘనపూర్ గ్రామంలో బుధవారం ముడా నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలకు శంఖుస్థాపన చేసారు.

ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు ఈరోజు తెలంగాణలో ఉన్నారని , తెలంగాణలో పెద్ద కాంట్రాక్టులన్నీ వాళ్లే చేస్తున్నారని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్ లో దందాలు కూడా వాళ్లే చేస్తున్నారని తెలిపారు. ‘‘ ఆ కోవర్టులకు మొత్తం నల్లా కలెక్షన్లు కట్ చేయండి, కరెంటు కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఒక్క రుపాయి లేకుండా వాళ్లను కట్ చేయండి..‘‘ అని సూచించారు.

అప్పుడు వాళ్లే వెళ్లి చంద్రబాబు కాళ్లు పట్టుకొని బనకచర్ల బంద్ చేయిస్తారని అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంచిగ చెబితే ఆంధ్రోళ్లు వినరని, ఈ పని చేస్తే వారం రోజుల్లో బనకచర్ల బంద్ అవుతుందని చెప్పారు. తాను చేస్తున్న సూచనను గమనించాలని మంత్రి ఉత్తమ్ ను కోరారు. 

మేము చేసిన అభివృద్ధికి మోతీఘనపూర్ గ్రామమే సాక్ష్యం: గత పది ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీ గ్రామానికి ఏం చేసారో ప్రజలు ఆలోచించుకోవాలని అనిరుధ్ రెడ్డి ఈ సందర్భంగా మోతీఘనపూర్ గ్రామస్తులను కోరారు. మోతీఘనపూర్ ను అభివృద్ధి చేయకపోగా ఈ గ్రామానికి రావాల్సిన రూ.4.50 కోట్ల మూడా నిధులు మహబూబ్ నగర్ కు మళ్లించారని విమర్శించారు. తనకు మోతీఘనపూర్  గ్రామంతో అనుబంధం ఉందని, అందుకే అభివృద్ధి పనుల్లో ఈ గ్రామానికి ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు.

అందులో భాగంగానే  ఈ రూ.50 లక్షల నిధులు సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ కోసం మంజూరు చేశామన్నారు. ఇప్పటివరకు గ్రామంలో రూ.3 కోట్ల రైతు రుణమాఫీ ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వ 10 ఏళ్లలో ఒక్క ఇళ్లయినా, రేషన్ కార్డు అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో 28 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసామని, 157 కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరయ్యానీ వెల్లడించారు. సీఎస్ఆర్ ఫండ్స్  ద్వారా రూ.15 లక్షలు,  పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి ఇచ్చామని గుర్తు చేశారు. 

మోతీఘనపూర్ గ్రామాన్ని చూస్తే పదేళ్లలో లక్ష్మారెడ్డి చూపిన నిర్లక్ష్యం, తాను  సంవత్సరం కాలంలో నేను చేసిన అభివృద్ధి ఏమిటో అర్థమౌతుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్బంగా అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -