నవతెలంగాణ-ఏర్గట్ల : మండలంలోని తడపాకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్వేష్ యాదవ్ ,అనిల్ యాదవ్ వాళ్ళ తండ్రి ఇటీవలే మృతిచెందడంతో బుధవారం బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ డెవలప్ మెంట్ చైర్మన్, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ దేవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెం గంగాప్రసాద్, జిల్లా జనరల్ సెక్రెటరి రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగారెడ్డి, జిల్లా సెక్రెటరి గిర్మాజి గోపి, మాజీ జడ్పీటీసి గుల్లే రాజేశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, నాయకులు మునిరోద్దీన్, వెంకట్ రెడ్డి, రోక్కెడ సంజీవ్, దిబ్బ శ్రీను, సంసన్, రాజు, భాను, శ్రీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మానాల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES