- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల బంద్ కు PDSU పిలుపునిచ్చింది. విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ₹8వేల కోట్ల రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని, ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ బంద్ చేపడుతున్నట్లు తెలిపింది. వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని కోరింది.
- Advertisement -