- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
కాంటెనర్ లారీ బైక్ ను ఢీ కొనడంతో వ్యక్తి మరణించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా రామాయంపేట్ మండలం అక్కనపేట గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ (52) మండలంలోని ఫార్మా కంపెనీలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో వెనకాల నుండి వచ్చిన కాంటెనర్ లారీ బైకుని ఢీకొట్టగా లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
- Advertisement -