Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాలేజీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

కాలేజీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

- Advertisement -

 నవతెలంగాణ – భీంగల్ : నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నిజామాబాద్ జిల్లా ఎస్ ఎస్ యు ఐ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రహమాన్ ముఖ్యఅతిథిగా హాజరై కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి, లెక్చరర్లతో కలిసి విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రహమాన్ మాట్లాడుతూ. విద్యార్థిని విద్యార్థులు ప్రణాళికతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలతో కళాశాలలో చదివి ఉన్నంత స్థాయి లో ఎదిగి తల్లిదండ్రులకు విద్యను బోధించిన ఉపాధ్యాయులను మీ విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించి చూపించాలని అన్నారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వం కావున విద్యార్థులు కళాశాలలో చేరి అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు కళాశాల ప్రిన్సిపాల్ సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు బాల మల్లు, అరుణ్, జాన్సన్,ఆనందం, ఎన్ ఎస్ యు ఐ యువకులు శ్రీకాంత్, అత్రిష్ యాదవ్, శివ, అంజి, నిఖిల్ సన్నీ, సోను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -