నవతెలంగాణ – హైదరాబాద్: పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సిగాచీ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనపై విచారణకు నలుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించి నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. నిపుణుల కమిటీ చైర్మన్గా బి. వెంకటేశ్వర్, సభ్యులుగా ప్రతాప్ కుమార్, సూర్యనారాయణ, సంతోష్లను ప్రభుత్వం నియమించింది. బి. వెంకటేశ్వర్ నేతృత్వంలోని కమిటీ ప్రమాదానికి గల కారణం ఏంటి..? కంపెనీ అన్ని నిబంధనలు పాటించిందా లేదా అన్న అంశాలపై నిపుణుల కమిటీ విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేయనుంది. ఎక్స్ పర్ట్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
పాశమైలారం ప్రమాద ఘటనపై కమిటీ ఏర్పాటు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES