Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అడ్మిషన్లు పెంచేందుకు ఎకోపాధ్యాయుని కృషి.. కథనానికి స్పందించిన సబ్ కలెక్టర్

అడ్మిషన్లు పెంచేందుకు ఎకోపాధ్యాయుని కృషి.. కథనానికి స్పందించిన సబ్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : అడ్మిషన్లు పెంచేందుకు ఏకోపాధ్యాయుని కృషి అనే జూన్ 29వ తేదీన  నవతెలంగాణ తెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనానికి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి స్పందించారు. బుధవారం దోస్తుపల్లి ప్రభుత్వ ప్రాథమిక  పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎన్ని అడ్మిషన్లు ఎన్ని అయినాయో రికార్డులను పరీశీలించారు. ఎకోపాద్యానిగా ఉండి విద్యార్థుల సంఖ్య 8 నుండి 30 వరకు పెంచడం ఎంతో కృషి ఉందని అన్నారు. అడ్మిషన్లు పెంచితే పని భారం పెరుగుతుందని ఆలోచించకుండా అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేసినందుకు హెచ్ఎంవి శంకర్ ను ఆమె అభినందించారు.

అనంతరం విద్యార్థులతో మాట్లాడి  వారితో కలిసి సహపంక్తి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో భోజనం చేస్తూ మెను ప్రకారం ఎండిఎం వారు భోజనం పెడుతున్నారా? ఎటువంటి భోజనాలు అందిస్తున్నారు? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.శంకర్ ను పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగినందున మరో ఉపాధ్యాయున్ని నియమించాలని మండల విద్యాశాఖ అధికారికి సూచించారు. వెంటనే ఉపాధ్యాయుని కూడా అపాయింట్మెంట్ చేసామని ఎమ్ఈఓ తిరుపతయ్య, కాంప్లెక్స్  హెచ్ఎమ్ జెడ్ పి హెచ్ స్ జుక్కల్ హన్మంత్ రెడ్డి  సబ్ కలెక్టర్ కిరణ్మయికి తెలియజేశారు.

మండలంలోని ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రధాన ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. మారుమూల ప్రాంతంలో ఉంటున్న వేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ తో పాటు బాన్సువాడ ఆర్ఐ హనుమండ్లు, మండల విద్యాధికారి, కాంప్లెక్స్ హెచ్ఎమ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి. శంకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -