ముఖ్యఅతిథిగా హాజరైన మహిళా పోలీస్ స్టేషన్ సిఐ అర్జునయ్య..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి పట్టణంలోని జాగృతి డిగ్రీ కళాశాలలో సిడిఈడబ్ల్యూ, భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులకు మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అర్జునయ్య, సి డి ఈ డబ్ల్యూ కౌన్సిలర్స్ సరిత, స్వర్ణలత, ప్రసన్న లక్ష్మి , స్నేహలత, సఖి సెంటర్ నిర్వాహకులు వినీల, షార్ప్ ఎన్జీవో డాక్టర్ ప్రమీల, జాగృతి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మణిపాల్ రెడ్డి లు హాజరై , మాట్లాడారు.
విద్యార్థినిలపై మహిళలపై జరుగుతున్న నేరాలపై విద్యార్థినీలకు అవగాహన కల్పిస్తూ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. 100కు డయల్ చేయాలని, ఎవరు కూడా అధైర్య పడవద్దు అని అందరికీ అండగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రాములు ,ఏఎస్ఐ నుస్రత్ అలీ, హెడ్ కానిస్టేబుల్ వేదవతి, పోలీస్ స్టేషన్ సిబ్బంది రమేష్, లక్ష్మయ్య ,ఉమెన్ కానిస్టేబుల్ తిరుపతమ్మ , పోలీసు కళాజాత హుస్సేన్ బృందం వారు తమ పాటల తో విద్యార్థులను ఆకట్టుకున్నారు.
నేరాలపై అవగాహన సదస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES