తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు : పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పుట్ట మధుకు తాడిచెర్ల డేంజర్ జోన్ సమస్య, ఖమ్మంపల్లి నుండి భూపాలపల్లి రోడ్డు గుర్తుకు రాలేదా.? అధికారం కోల్పోయాక ప్రజల సమస్యలు గుర్తుకు వస్తున్నాయాని తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్యతోపాటు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బిఆర్ఎస్ నాయకులు చేసిన అసత్యపు ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం తాడిచర్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
తమ నాయకుడు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై బిఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఖమ్మంపల్లి నుండి భూపాలపల్లి రోడ్డు నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల పూజ చేస్తే జీర్ణించుకోలేకపోవడమే కాక ప్రజల్లో బిఆర్ఎస్ నాయకుల ఉనికి పోతుందని ఆందోళనకు గురివుతున్నట్లుగా తెలిపారు. ఫారెస్ట్ క్లీయరన్స్ వచ్చాకనే భూమి పూజ చేయడం జరిగిందని, అది తెలియని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, బిఆర్ఎస్ కార్యకర్తలు అరిసి పెడబొబ్బలు హాస్యాస్పదంగా ఉందన్నారు.
అన్ని అనుమతులు వచ్చాకనే తమ నాయకుడు రోడ్డుకు భూమిపూజ చేశారని ఫారెస్ట్ క్లీయరెన్సు పేపర్స్ చూపిస్తూ తెలియజేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని తాడిచెర్ల డేంజర్ జోన్ ప్రజలు అధికారం కోల్పోయాక గుర్తుకు వస్తున్నారాని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతిరావు, కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ నర్సింగరావు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి, డివిజన్ యూత్ నాయకుడు రాహుల్, నాయకులు కేశారపు చెంద్రయ్య, ప్రభాకర్, సది, సాత్విక్ పాల్గొన్నారు.
మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు గుర్తు రాలేదా.?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES