Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి శర్మ పరామర్శ 

బాధిత కుటుంబానికి శర్మ పరామర్శ 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర : మండలంలోని ఉప్పెరగూడెం గ్రామానికి చెందిన పెద్ది మల్లేశం (70) వృద్ధాప్యంతో ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, ప్రచార కార్యదర్శి గద్దల వెంకన్న తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -