Thursday, July 3, 2025
E-PAPER
Homeఖమ్మంపాలనలో కాంగ్రెస్ విఫలం: టీడీపీ నాయకులు స్వామి దొర

పాలనలో కాంగ్రెస్ విఫలం: టీడీపీ నాయకులు స్వామి దొర

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ ఆధ్వర్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లో  ఏర్పడిన  ప్రభుత్వం సంవత్సరం ఆరునెలలు అయినా పధకాలను ప్రజలకు చేర్చడంలో పూర్తిగా విఫలం అయిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అశ్వారావుపేట నియోజక వర్గం నాయకులు కట్రం స్వామి దొర ఆరోపించారు. పార్టీ నియోజక వర్గం స్థాయీ సమావేశం బుధవారం అశ్వారావుపేట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రజా పాలన అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత సంక్షేమ ఫలాలు ప్రజల వద్దకే అని చెప్పి నేటికి కూడా చేరలేదని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు పేదవాడికి కలగానే మిగిలిపోయేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని దుయ్యబట్టారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను వదిలేసి రాష్ట్రంలో 22 సంవత్సరాల నుండి అధికారంలో లేని తెలుగుదేశం పార్టీని,దాని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు ని టార్గెట్ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ వైఖరి ఏమిటో వారి ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు సమక్షంలో వార్డు నుంచి జెడ్పీటీసీ వరకు రాబోవు స్థానిక ఎన్నికల్లో పోటీ అంశం పై చర్చించినట్లు ఆయన తెలిపారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద,బనకచర్ల ప్రాజెక్టు గురించీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పష్టత లేని విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం అన్నారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే నిలువ చేసుకుంటామని ముఖ్యమంత్రి అంటుంటే సగం తెలిసి సగం తెలియని కాంగ్రెస్ నాయకులు కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతూ మరలా బాబు తెలంగాణ కు ఎలా వస్తారు అని మాట్లాడటం బాధాకరం అన్నారు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరిగి జండా ఎగుర వేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట,దమ్మపేట,ములకలపల్లి,అన్నపు రెడ్డి పల్లి,చండ్రుగొండ అద్యక్షులు నార్లపాటి శ్రీనివాసరావు,వలీ పాషా, తేల్ల చిన్నయ్య, పానుగంటి రామారావు, వారధి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ సమావేశంలో మండలాల అద్యక్షులు వారధి సత్యనారాయణ, దమ్మపేట పీఏసీఎస్( సొసైటీ) మాజీ వైస్ చైర్మన్ కట్నం ఎర్రప్ప, అశ్వారావుపేట పట్టణ అధ్యక్షులు అంకోలు వెంకటేశ్వరరావు, తెలుగు యువత నాయకులు బొడ్డపాటి ఉదయ్ కుమార్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -