నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : జిల్లాలోని ఎస్సీ ప్రభుత్వ విద్యార్థినుల వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు నూతన భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ ని భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ కలిసి వినతిపత్రం అందజేశారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి వెళ్తూ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన మంత్రి లక్ష్మణ్ ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని బెస్ట్ అవైలబుల్(బాస్) స్కీమ్ కింద ప్రైవేట్ స్కూలులో చదువుతున్న విద్యార్థులకు ఇవ్వవలసిన నిధులు గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి.
స్కూల్ యాజమాన్యాలు వాళ్ళు ఆర్థిక భారం మోయలేక ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక భారంతో యూనిఫామ్ లు, బుక్స్, ఫీజులు, చెల్లించాలని విద్యార్థులపై వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నందున తక్షణమే బెస్ట్ అవైలబుల్ (బాస్) నిధులను విడుదల చేయాలని, ఎస్సీ బాలికల వసతి గృహాలలో ఉన్న సమస్యలను వివరించారు. ఎస్సీ విద్యార్థుల పోస్టుమట్రిక్ స్కాలర్షిప్లను సైతం విడుదల చేయాలని అలాగే ఎస్సీ కులాంతర వివాహం చేసుకున్న వివాహితులకు రావలసిన ప్రోత్సహకం నిధులు లేక ఆగిపోయినందున వెంటనే వాటిపై దృష్టి సారించి నిధులను విడుదల చేయాలని మంత్రిని కోరారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ఎస్సీ బాలికల వసతి గృహం నిర్మించేందుకు నిధులను విడుదల చేసి విద్యార్థుల సంఖ్యకు తగినన్ని గదులను అందుబాటులోకి తేవాలన్నారు. ప్రస్తుతం ఉన్న వసతి గృహాలలో సరైన సదుపాయాలు లేనందువల్ల విద్యార్థినులు అసౌకర్యానికి గురవుతున్నారని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే కావలసిన నిధులను విడుదల చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని మంత్రికి వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES