Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కిషన్ రావుపల్లి రోడ్డుకు హద్దుల ఏర్పాటు ప్రారంభం..

కిషన్ రావుపల్లి రోడ్డుకు హద్దుల ఏర్పాటు ప్రారంభం..

- Advertisement -

మాజీ ఎంపీపీ మలహల్ రావు 
నవతెలంగాణ – మల్హర్ రావు
: మండలంలో కిషన్ రావు పల్లి నుంచి పారెస్ట్ మీదుగా భూపాల పల్లి జిల్లా కేంద్రం వరకు రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడానికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బుధవారం అటవీశాఖ అధికారులు అటవీ మార్గంలో రోడ్డుకు రెండువైపులా హద్దుల కొలతలను ప్రారమించారని మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు తెలిపారు. దీంతో రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏప్డిఓ అప్పల కొండయ్య, భూపాలపల్లి జిల్లా రేంజ్ అధికారి నరేష్, కొయ్యూరు రేంజి అధికారి రాజేశ్వరరావు, ఆర్అండ్ బి ఏఈ అబినాష్, తాడిచర్ల సెక్షన్ అధికారి గొడుగు లక్ష్మన్, బిట్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -