Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్య

ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్య

- Advertisement -

వందశాతం లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి
ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేసిన ఏఈఓ లక్ష్మన్
నవతెలంగాణ – మల్హర్ రావు
: ప్రయివేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందింస్తు, వందశాతం ఉత్తీర్ణతయే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని మండల విద్యాశాఖ అధికారి లక్ష్మన్ ఆయా గ్రామాల ప్రాధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం మండలంలోని కొయ్యుర్ ఎమ్మార్సీ భవనంలో మండల స్థాయి ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా మండలంలోని అన్ని పాఠశాల హెచ్ఎంల సమావేశం ఏర్పాటు చేసి ప్రధానో పాధ్యాయులకు దిశ నిర్దేశం చేయడం జరిగిందన్నారు.

విద్యార్థుల విద్యా పట్ల శ్రద్ధ వహించాలని ప్రతి విద్యార్థికి యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, నాణ్యత గల మధ్యాహ్న భోజనము అందించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుతూ.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం టి.సుదర్శనం, సిహెచ్. తిరుపతి, పిజి హెచ్ఎమ్స్ నర్సింగరావు, తిరుపతీ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ భవాని, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ఎమ్మార్సి సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -