Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లెల్లో పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలి

పల్లెల్లో పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలి

- Advertisement -

పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీడీవో
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ 
: వర్షాలు కురుస్తున్నాండంతో పల్లెల్లో పరిశుభ్రత అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీవో లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ… సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున  పల్లెల్లో పరిశుభ్రతను  ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా  ప్రతి గ్రామ పంచాయతీ  పరిధిలో మొక్కలు  నాటే విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీకాంత్, ఉపాధి హామీ ఏపీఓ  సుదర్శన్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -