Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సన్మానం..

రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులై జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తాను బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.  అనంతరం శ్రీనివాస్ గుప్తా , కైలాస్ శ్రీనివాసరావు లు మాట్లాడుతూ జులై 4 న ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బహిరంగ సభ, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే  హాజరవుతున్నారాని ఈ కార్యక్రమానికి కామారెడ్డి నియోజకవర్గంలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ మండల అధ్యక్షలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు,  మాజీ జెడ్పిటిసిలు,  ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాలు కాంగ్రెస్ నాయకులు  కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున  ఈ సభకు తరం వచ్చే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశించారని జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండ్ల రాజు , యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, జిల్లా లీగల్ చైర్మన్ దేవరాజు గౌడ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుట్నాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు కన్నయ్య, రవీందర్ గౌడ్, చాట్ల రాజేశ్వర్, రాజా గౌడ్, బట్టు మోహన్, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మత్, లక్కపత్ని గంగాధర్, పడిహార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -