నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరైన విద్యార్థులకు ఈ ప్రోత్సాహక బహుమతులను అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ తెలిపారు. జూన్ నెలలో 14 రోజులు పాఠశాల నడవగా 14 రోజులు పాఠశాలకు హాజరైన 6, 7, 8, 9, 10 తరగతి లకు చెందిన విద్యార్థులకు ఈ ప్రోత్సాహక బహుమతులు అందజేసినట్లు ఆయన తెలిపారు.
బహుమతులు పొందిన వారిలో 6వ తరగతిలో జ్వాల రిత్విక, తమ్మిశెట్టి హేమలత, జెట్టి రిశ్వంత్, 7వ తరగతిలో రోస్ నితీష్, 8వ తరగతిలో జెట్టి శ్రీకాంత్, రాధారపు అక్షిత, 9వ తరగతిలో తమ్మిశెట్టి విశ్వతేజ, కోరుట్ల రశ్మిత, శనిగారపు దీక్ష, 10వ తరగతిలో సుందరగిరి చరణ్ తేజ లకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రతినెల పాఠశాలకు 100 శాతం హాజరైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేస్తామన్నారు. విద్యార్థులను పాఠశాలకు క్రమం తప్పకుండా రప్పించే కార్యక్రమంలో భాగంగానే ఈ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES