నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని హాస కొత్తూర్ గ్రామానికి చెందిన జుంబరత్ అన్వేష్ మృతదేహం బుధవారం సాయంత్రం స్వగ్రామానికి చేరింది. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశమైన ఒమన్ వెళ్లిన అన్వేష్ 15 రోజుల క్రితం అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్వేష్ మృతదేహాన్ని స్వగ్రామం రప్పించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించిన కంపెనీ వారు స్పందించకపోవడంతో 15రోజుల నుండి చాలా యిబ్బందిపడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, ముత్యాల సునీల్ రెడ్డిలు ప్రభుత్వం ద్వారా గల్ఫ్ కన్వీనర్ బీంరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వారు స్పందించి మన దేశం ఎంబసీతో మాట్లాడి మృతదేహం త్వరగా రావడానికి కృషి చేశారు.
దీంతో బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అన్వేష్ మృతదేహం చేరుకుంది. మృతదేహాన్ని విమానాశ్రయం నుండి ప్రభుత్వం తరఫున ఎటువంటి ఖర్చులు లేకుండా అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసి మృతుడి స్వగ్రామం హస కొత్తూర్ కు సాయంత్రం తీసుకువచ్చారు. ఒమన్ నుండి అన్వేష్ మృత దేహం ఇంటికి చేరడానికి ప్రభుత్వం చాలా సహాయం చేసిందని పేర్కొంటూ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ తరపున రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య అన్వేష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్లిన అన్వేష్ శవమై స్వగ్రామం చేరడం గ్రామస్తులను కలిసివేసింది.
ప్రభుత్వ సాయంతో స్వదేశానికి వచ్చిన మృతదేహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES