సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించిన చిత్రం ‘సోలో బాయ్’. నవీన్ కుమార్ దర్శకుడు. బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతం కష్ణ హీరోగా, రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈనెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ,’నిర్మాత సతీష్ ఒక దర్శకుడిగా ఇండిస్టీకి వచ్చి ‘బట్టల రామస్వామి’ బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. చాలా సాధారణ స్థాయి నుండి నిర్మాతగా మారడానికి ఎంతో కష్టపడి, ఇక్కడ వరకు వచ్చారు. ఈ చిత్రంలో నటించిన గౌతమ్ కష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించి, సతీష్ ప్రయాణానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘ఈ సినిమాలో అన్ని రకాల జోనర్లు కనిపిస్తూ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది. గౌతమ్ కష్ణ ఎంతో అద్భుతంగా నటించారు. అలాగే ఇద్దరు హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. పాటలు, సంగీతం చాలా బాగా వచ్చాయి’ అని దర్శకుడు నవీన్ కుమార్ చెప్పారు.
నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ, ‘చాలా చిన్నగా మొదలై, ఇప్పుడు పెద్ద స్థాయిలో విడుదల కాబోతున్న సినిమా ఇది. గౌతమ్ ఈ సినిమా కోసం ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ ఇది. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందకు చాలా గర్వంగా ఉంది’ అని తెలిపారు.
‘సోలో బాయ్’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES