Thursday, July 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎస్‌కు హైకోర్టు నోటీసులు

సీఎస్‌కు హైకోర్టు నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని మున్సిపాలిటీల్లోని పేదలకు అమలు చేయాలన్న వినతిపత్రంపై చర్యలు తీసుకోలేదంటూ దాఖలైన కోర్టుధిక్కార పిటి షన్‌లో రాష్ట్ర పభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి టి.కె.శ్రీదేవిలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12 వేలు చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం జనవరిలో జీవో 42 జారీ చేసింది.ఈ పథకాన్ని మున్సిపాల్టీల్లోని పేదలకు కూడా అమలు చేయాలనే పిల్‌ను గతంలో హైకోర్టు విచారించింది. పిటిషనర్‌ ప్రభు త్వానికి విజ్ఞప్తి చేసుకోవాలనీ, ఆ వినతిపై అధికారులు తగిన చర్యలు తీసుకో వాలని అప్పట్లో హైకోర్టు ఆదేశించింది.


వినతిపత్రం ఇచ్చినా చర్యలు శూన్య మంటూ నారాయణపేటకు చెందిన జి శ్రీనివాస్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజోరుపాల్‌, జస్టిస్‌ యారా రేణుకలతో కూడి న డివిజన్‌ బెంచ్‌ విచారించి, తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.


గ్రూప్‌ 1లో అవకతవకలపై మూడో రోజు కొనసాగిన వాదనలు
గ్రూప్‌ వన్‌ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ మూడో రోజైన బుధవారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. పరీక్షకు హాజరైన అభ్య ర్థుల్లో 8వేల మంది తెలుగులో పరీక్ష రాస్తే కేవలం 60 మందే అర్హత సాధిం చారు. మూల్యాంకనం చేసే వారికి తెలుగు భాష మీద పట్టు లేకపోవడంతో తెలుగులో పరీక్ష రాసిన వారికి తీరని అన్యాయం జరిగింది. తెలుగురాని, అర్హత లేని వారు మూల్యాంకనం చేయడం వల్ల ఈ పరిస్థితికి కారణం..

అని పిటిషనర్ల లాయర్లు వాదించారు. గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షల మూల్యాంకనం పారదర్శకంగా జరిగాయని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) లాయర్‌ వాదించారు. మూల్యాంకనం మూడు దశల్లో జరుగుతుంది. ప్రొఫెసర్‌ మూ ల్యాంకం చేశాక రెండో మూల్యాంకనం జరుగుతుంది. ఇందులో వ్యత్యాసం 15 శాతానికి మించితే మూడో వ్యక్తి మూల్యాకనం కూడా జరుగుతుంది. తొలి మూల్యాంకనంలో ఎన్ని మార్కులు వచ్చాయో రెండో మూల్యాంకనం చేసేవాళ్లకు తెలియదు. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరిగింది. గ్రూప్‌1పై నమోదైన పిటిషన్లు కొట్టేయాలి.. అని టీజీపీఎస్సీ వాదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -