Thursday, July 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో నేడు విచారణకు హాజరు కావాలి

ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో నేడు విచారణకు హాజరు కావాలి

- Advertisement -

ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌కు ఏసీబీ నోటీసులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో విచారణకు గురువారం తమ ఎదుట హాజరు కావాలని హెచ్‌ఎండీఏ మాజీ కమిషనర్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రెండ్రోజుల క్రితమే విచారణకు హాజరు కావాల్సిన అరవింద్‌ కుమార్‌ అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానని ఏసీబీకి సమాచారం పంపించాడు. కాగా, ఈ మారు ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరుకావాలని అరవింద్‌ కుమార్‌ను ఏసీబీ కోరింది. ఇప్పటికే ఈ కేసులో రెండు సార్లు ఏసీబీ విచారించింది. అనంతరం ఈ కేసులో మొదటి నిందితుడిగా పేర్కొన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను విచారించిన ఏసీబీ అధికారులు ఆయన ఇచ్చిన సమాచారంపై అరవింద్‌ కుమార్‌ను తిరిగి విచారించనున్నట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -