– రెండేండ్లకోసారి కేవైసీ తప్పనిసరి
నవ తెలంగాణ – హైదరాబాద్
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మార్గదర్శకాల ప్రకారం అధిక రిస్కు కలిగిన ఖాతాదారులు రెండేండ్లకోసారి నో యువర్ కస్టమర్ (కేవైసీ) డాక్యూమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి ఖాతాను కస్టమర్ వృత్తి ఆధారంగా తక్కువ, మధ్యమ, అధిక రిస్క్‌గా వర్గీకరించాల్సి ఉంటుందని తెలిపింది. తక్కువ రిస్క్ కలిగిన ఖాతాదారులు 10 సంవత్సరాలకు ఒకసారి, మధ్యమ రిస్క్ కస్టమర్లు 8 సంవత్సరాలకు, అధిక రిస్క్ కస్టమర్లు 2 సంవత్సరాలకు ఒకసారి కెవైసిని సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రీ కెవైసి పోర్టల్, కార్పొరేట్ వెబ్‌సైట్‌లో కెవైసిని అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. లేదా వాట్సాప్ బ్యాంకింగ్ 9666606060కు హై అని పంపడం ద్వారా డాక్యూమెంటేషన్ సమర్పించవచ్చని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాలు, శాఖలలో కస్టమర్లు రీ-కేవైసీ నవీకరించడానికి ఒక మెగా క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కేవైసీ నవీకరణ కోసం సమీప శాఖను సందర్శించాలని లేదా బిజినెస్ కరస్పాండెంట్స్‌ను సంప్రదించాలని సూచించింది.
రీ కేవైసీకి యూనియన్ బ్యాంక్ మెగా క్యాంపెయిన్
- Advertisement -
- Advertisement -