Thursday, July 3, 2025
E-PAPER
Homeబీజినెస్నేడు మలబార్‌ గోల్డ్‌ తయారీ యూనిట్‌ ప్రారంభం

నేడు మలబార్‌ గోల్డ్‌ తయారీ యూనిట్‌ ప్రారంభం

- Advertisement -

– ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి..
హైదరాబాద్‌ :
ప్రముఖ అభరణాల రిటైల్‌ చెయిన్‌ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమాండ్స్‌ మహేశ్వరంలోని ఐపి జనరల్‌ పార్క్‌లో తమ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దీనిని గురువారం ముఖ్య అతిథి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్‌ బాబు లాంచనంగా ప్రారంభిం చనున్నారు. అదే విధంగా మలబార్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎంపి అహ్మాద్‌ హాజరు కానున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఈ యూనిట్‌ను దాదాపు 3.7 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. దాదాపు 750 కోట్ల పెట్టుబడుల వ్యయం చేస్తోన్నట్లు ఇది వరకు ఆ సంస్థ పేర్కొంది. సంవత్సరానికి 10 టన్నుల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాల ఆభరణాలు, 180 టన్నుల సామర్థ్యంతో అత్యాధునిక బంగారు శుద్ధీకరణ చేయాలని నిర్దేశించుకుంది. మలబార్‌ గోల్డ్‌కు 13 దేశాల్లో 370 పైగా షోరూంలున్నాయి. తెలంగాణలో ఈ ఏడాది జనవరి నాటికి 23 స్టోర్లతో 1000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. తెలంగాణతో పాటు భారత్‌లో 9 యూనిట్లు కలిగి ఉంది. కతర్‌, దుబారు, షార్జా, బహ్రెయిన్‌లో 5 యూనిట్లున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -