– ఉన్నత విద్యా కాలేజీ యాజమాన్యాల సమాఖ్యతో
ఉప ముఖ్యమంత్రి భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడతల వారీగా చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉన్నత విద్యా కాలేజీ యాజమాన్యాల సమాఖ్య (ఎఫ్‌ఏటీహెచ్‌ఐ) ప్రతినిధులు భట్టి విక్రమార్కను కలిసి ఫీజు బకాయిలకు సంబంధించి వినతిపత్రం అందజేశారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా, నర్సింగ్ తదితర కాలేజీలకు మూడేండ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.వేల కోట్లు పేరుకుపోయాయని తెలిపారు. దీనిపై వివరంగా ఉపముఖ్యమంత్రితో వారు చర్చించారు. ఈ సందర్భంగా సమాఖ్య చైర్మెన్ నిమ్మటూరి రమేష్‌బాబు వివిధ గణాంకాలతో ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలకు సంబంధించిన వివరాలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఎలా చెల్లించొచ్చో ప్రత్యేక ప్రత్యామ్నాయ ప్రణాళిక గురించి వివరించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ ఈనెల ఏడో తేదీన సచివాలయంలో సంబంధిత మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అధికారిక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు హామీ ఇచ్చారు.
ప్రస్తుతం డిగ్రీ తుది సంవత్స రం పూర్తి చేసిన విద్యార్థులకు నాలుగేండ్లపాటు ఉన్న ఫీజు బకాయిలను, దాంతో పాటు వివిధ కాలేజీలకు మంజూరు చేసిన టోకెన్ మొత్తాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏఫ్‌ఏటీహెచ్‌ఐ ప్రతినిధి బృందం ఉప ముఖ్య మంత్రిని కోరింది. ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొంది. ఈ కార్య క్రమంలో ఏఫ్‌ఏటీహెచ్‌ఐ ప్రతినిధులు కొడాలి కృష్ణారావు, ప్రదీప్‌రెడ్డి, కె రామదాస్, సునీల్‌కుమార్, సరస్వతీ రమేష్, కోదాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫీజు బకాయిలు విడతల వారీగా చెల్లిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES