– హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మిలింద్ ప్రకాశన్ ప్రచురణ సంస్థ సంచాలకులు, హిందీ పుస్తక ప్రపంచంలో పండితులు, సమాజ సేవకులు విభా భారతి(83) మృతి బాధాకరమని హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీ పేర్కొంది. సంతాపాన్ని ప్రకటించింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. బుధవారం ఈ మేరకు బుక్‌ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్, కార్యదర్శి ఆర్.వాసు, ఉపాధ్యక్షులు కె.బాల్‌రెడ్డి, శోభన్‌బాబు, సంయుక్త కార్యదర్శులు సూరిబాబు, సురేశ్, కోశాధికారి నారాయణరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ నగరంలో హిందీ పుస్తకాలకు చిరునామాగా మిలింద్ ప్రకాశన్ సంస్థను తీర్చిదిద్దడంలో శృతికాంత్, విభాభారతి కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ప్రముఖ ప్రచురణ సంస్థల హిందీ పుస్తకాలను పంపిణీ చేస్తూ ప్రజల అందుబాటులోకి మిలింద్ ప్రకాశన్ తీసుకొచ్చిందని కొనియాడారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహణలో భారతి దంపతులిద్దరూ చురుకుగా పాల్గొనేవారని గుర్తుచేశారు. బుక్‌ఫెయిర్ సంయుక్త కార్యదర్శిగా విభా భారతి చాలా ఏండ్ల పాటు విశిష్ట సేవలందించారని తెలిపారు. ఆమె కాచిగూడలోని తన స్వగృహంలో మంగళవారం చనిపోయారని పేర్కొన్నారు. సొసైటీ తరఫున ఆమె మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జూలూరు గౌరీశంకర్ సంతాపం
విభా భారతి మరణం పట్ల తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ జూలూరీ గౌరీశంకర్, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ మాజీ కార్యదర్శి కె.చంద్రమోహన్ సంతాపం ప్రకటించారు. ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మిలింద్ ప్రకాశన్ సంచాలకులు విభా భారతి మృతి బాధాకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES