Thursday, July 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా మత్తు పదార్థాలు స్వాధీనం.. నైజీరియన్ అరెస్ట్

భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం.. నైజీరియన్ అరెస్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా ఆసిఫ్ నగర్ లో భారీగా మత్తు పదార్థాలు బయటపడ్డాయి. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నైజీరియన్ ను వెంబడించి పట్టుకుని అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి పోలీసులు వెంబండించారు. ఆసిఫ్ నగర్ లోనీ ఓ అపార్ట్మెంట్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఎస్ఓటీ పోలీసులు ఆసిఫ్ నగర్ లోని ఓ ఫ్లాట్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దొరికిన మత్తు పదార్థాలను టెస్టింగ్ కు తరలించారు. మారేడు పల్లి, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరిపై పలు కేసులు నమోదయ్యాయి. కేటుగాళ్లు కోర్టుకు హాజరవకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -