Thursday, July 3, 2025
E-PAPER
Homeకరీంనగర్మాజీ సర్పంచ్ తండ్రి మృతి… పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మాజీ సర్పంచ్ తండ్రి మృతి… పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ తండ్రి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ కొండు  సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం ఆమె కుటుంబ సభ్యులను మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పరామర్శించారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే  వెంట పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, కరీంనగర్ మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి మనోహర్, పివి రావు, మాజీ వార్డ్ సభ్యులు తన్నీరు ప్రదీప్,కొండు వేణుమాధవ్,కొండు ప్రతాప్, వేణు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -