- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హనుమకొండ జిల్లా న్యూ శాయంపేట శివారులో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. మృతుడి వద్ద సెల్‌ఫోన్ గానీ, ఎలాంటి గుర్తింపు పత్రాలు గానీ లభించలేదు. ఈ ఘటనపై జీఆర్పీ వరంగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మృతుడి పూర్తి వివరాల కోసం జీఆర్పీ వరంగల్ పోలీసులను సంప్రదించగలరని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- Advertisement -