- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ నేడు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. సుమారు 140 రోజుల పాటు జైల్లో గడిపిన అనంతరం బుధవారం ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. వెంటనే ఈరోజు ఉదయం జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ, కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు అధినేతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్.. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు.
- Advertisement -