నవతెలంగాణ-హైదరాబాద్: రైతుల ఆదాయన్ని రెండింతలు చేస్తున్నానని ప్రధాని మోడీ బీరాలు పలికారాన్ని, కానీ పెరిగిన ధరలు వారి ఆదాయన్ని దోపిడీ చేస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. పెంచిన డీజిల్, పెట్రోలు రేట్లు వ్యవసాయం రంగంపై అదనపు భారాన్ని మోపాయని, దీంతో అన్నదాతలపై సాగు ఖర్చు పెరిగిపోతుందని ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. విత్తనాలు, రసాయన ఎరువులు, వ్యవసాయ సాధనాలపై రేట్లు పెరిగిపోయి..సాగుదారుల కష్టానికి ఫలితం లేకుండపోతుందన్నారు.
మహారాష్ట్రలో గడిచిన మూడు నెలల్లో 767 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని. ఇవి గణాంకలు కాదని, మృతి చెందిన రైతు కుటుంబాల జీవితాలు ముక్కలైయ్యాయని వాపోయారు. మోడీ ప్రభుత్వం ఇవన్ని చూస్తు మౌనంగా ఉందని ఆయన మండిపడ్డారు. “రైతులు రోజురోజుకూ అప్పుల్లో కూరుకుపోతున్నారు – విత్తనాలు ఖరీదైనవి, ఎరువులు ఖరీదైనవి, డీజిల్ ఖరీదైనవి… కానీ MSP కి ఎటువంటి హామీ లేదు. వారు రుణమాఫీని డిమాండ్ చేసినప్పుడు, వారిని విస్మరిస్తారు అని రాహుల్ ఆరోపించారు, “కానీ బిలియన్ల కొద్దీ ఉన్నవాళ్ళ రుణాలను మోడీ ప్రభుత్వం సులభంగా మాఫీ చేస్తుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మోడీ హామీ ఇచ్చారు – వాస్తవమేమిటంటే దేశానికి ఆహారం అందించే వారి జీవితాలు సగానికి తగ్గిపోతున్నాయి. ఈ వ్యవస్థ నిశ్శబ్దంగా, కానీ అవిశ్రాంతంగా రైతులను చంపుతోంది, ప్రధాని తన సొంత ప్రజా ప్రచార ప్రదర్శనను చూసుకుంటూ బిజీగా ఉన్నారని విమర్శించారు.