నవతెలంగాణ-హైదరాబాద్: రామాయణ’ ఫస్ట్ గ్లింప్ రిలీజయ్యింది. హీరోయిన్ సాయిపల్లవి, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రామాయణ’. ఈ సినిమాకు దంగల్ సినిమా దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.
రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తున్నారు. కన్నడ స్టార్ నటుడు యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ముల్లోకాలను త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణువు, శివుడు) పరిపాలిస్తున్నారు. బ్రహ్మ అందరిని సృష్టిస్తే.. విష్ణువు రక్షిస్తాడు. శివుడు అంతం చేయగలిగే వాడు. అయితే, వారు సృష్టించిన ఈ మూడు లోకాలపై ఆధిపత్యం కోసం వారు ఎదురు తిరిగినప్పుడు, అన్ని యుద్ధాలను అంతం చేసే ఒక మహాయుద్ధం మొదలైంది. ” 5 వేల సంవత్సరాలుగా, 2500 కోట్ల మంది ప్రజలు ఆరాధించేది ఇదే. రామాయణం మన వాస్తవం, మన చరిత్ర ” అంటూ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా నటిస్తుండగా.. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటించబోతున్నారు.