నవతెలంగాణ-హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. జూన్ 16వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ ను విచారణ చేసింది. ఈ కేసులో A2గా అరవింద్ కుమార్, A1గా కేటీఆర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణలో కీలక అంశాలు ప్రస్తావించారు. అప్పటి మున్సిపల్ శాఖ మినిస్టర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ తెలిపారు. HMDW ఖాతా నుంచి FEO కంపనీకి నిధులు మల్లింపుపై తన ప్రమేయం లేదని ఆయన తేల్చి చెప్పారు.
అయితే, అప్పటి మంత్రి స్వయంగా వాట్సప్ ద్వారా FEOకి నిధులు విడుదల చేయాలని ఆదేశించారు అని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణలో తెలిపారు. ఇందులో నాకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదు.. బిజినెస్ రూల్స్, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని మంత్రికి చెప్పాను.. FEO కంపనీకి వెంటనే నిధులు విడుదల చేయాలని, అవ్వని నేను చూసుకుంటానని మంత్రి చెప్పారని అరవింద్ కుమార్ వెల్లడించారు. దీంతో 45.71 కోట్ల రూపాయల నగదును ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించామని తేల్చి చెప్పారు.