Friday, July 4, 2025
E-PAPER
Homeఖమ్మంపేదోడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వం లక్ష్యం

పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వం లక్ష్యం

- Advertisement -

ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు,‌ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ‌
నవతెలంగాణ – అశ్వారావుపేట
: పేదోడి సొంతింటి కల నెరవేర్చడం మే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం అని, పల్లె ప్రాంతాలకు చెందిన పేద కుటుంబాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పేర్కొన్నారు. సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం తో వేలాది కుటుంబాల ఆశలు నెరవేరును న్నాయి అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

అశ్వారావుపేట తన అధికారిక  క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారులకు,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ అర్హులకు చెక్కులు,ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాన్యుడి వివాహ ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాయని ఆయన అన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద మొత్తం 92 చెక్కులను (రూ. 92,10,672 విలువైనవి), ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు రూ.4,78,500 లు తక్షణ సహాయం అందించడం జరుగుతోందని వివరించారు.ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల మేలు అందేలా తన నియోజకవర్గంలో చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ,ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,మున్సిపల్ కమీషనర్ బీ.నాగరాజు,పీఏసీఎస్ అశ్వారావుపేట అద్యక్షులు సీహెచ్.సత్యనారాయణ,మొగుళ్ళు చెన్నకేశవ రావు,జూపల్లి రమేష్,తుమ్మ రాంబాబు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -