Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ది పనుల్లో వేగం పెంచాలి 

అభివృద్ది పనుల్లో వేగం పెంచాలి 

- Advertisement -

-హుస్నాబాద్ రింగ్ రోడ్డు ప్లానింగ్ చేయాలి
-అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్  హైమావతి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
: హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. గురువారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. హుస్నాబాద్ రింగ్ రోడ్డు ప్లానింగ్ చేసి  మూలమలుపులు ఎక్కువగా లేకుండా వాహనదారులు సులభంగా వెళ్లేందుకు మ్యాపింగ్ చెయ్యాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు.

హుస్నాబాద్ నుండి కొత్తపల్లి 4 వరసల రహదారి నిర్మాణం పనులు ఆయా శాఖల అధికారులు వేగంగా పర్మిషన్ లు ఇవ్వాలని, టెండర్ విధానం పూర్తి చేసి రోడ్లు ఇరువైపుల చెట్లు నరకడం, తొలగించడం ఈ నెల చివరకల్ల పూర్తి చేయాలని పేర్కొన్నారు . రోడ్డు పనులు మొదలవ్వాలని ప్రతి పని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని పనిచేయాలని అర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. అంతక్కపేట లో 220కెవి విద్యుత్ జంక్షన్ 10 ఎకరాల స్థలం ఉందని ట్రాన్స్కో అధికారులు వెంటనే ఆయా అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లెలగడ్డ వద్ద శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల కు సంబంధించిన స్థల సేకరణ పూర్తీ చేశామని తెలిపారు .రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని అనుమతులు రాగానే ఇంజనీరింగ్ అధికారులకు అందిస్తామని అన్నారు.

కొత్తచెరువు బండ్ డెవలప్మెంట్ కోసం ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇవ్వాలని తెలిపారు. రంగనాయక సాగర్ నుండి నీటిని అందించడం కోసం బస్వాపూర్, పోరెడ్డి పల్లి లో కాలువల భూ సేకరణ ప్రక్రియ అవార్డ్ స్టేజ్ పూర్తయిందని చెప్పారు. హుస్నాబాద్ నుండి జనగాం వరకు నిర్మించే రోడ్డు నిర్మాణం ప్రపోజల్ స్టేజ్ లో ఉందని, నాక్ సెంటర్ కోసం స్థల సేకరణ పూర్తయిందని తెలిపారు.హుస్నాబాద్ లో అర్టిఎ యూనిట్ ఆఫీస్ కోసం ల్యాండ్ అందించామని ప్రపోజల్ స్టేజ్ ఉందని తెలిపారు. డిగ్రీ కళాశాలలో పి జి కోర్సెస్ ఏం.కామ్ కోర్సు 60 సీట్లు మజూరైయ్యాయని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ అయిన ఇల్లు గ్రౌండింగ్ చేయాలన్నారు.

ఏంపిడిఓలు , మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. 150 పడకల ఆసుపత్రి, కోహెడ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ క్యాంప్లెక్స్ నిర్మాణం, ఇండస్ట్రియల్ పార్కు, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సింగరాయకొండ ప్రాజెక్ట్ ద్వారా కొత్త ఆయకట్టుకు నీరు అందించడం కోసం కాలువల భూ సేకరణ పనుల, స్పోర్ట్స్ స్టేడియం లో ఆడిటోరియం, స్విమ్మింగ్ పూల్, జిమ్ ప్రపోజల్ గూర్చి తదితర అభివృద్ధి కార్యక్రమాల గూర్చి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -