Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాటేందుకు మొక్కలు సిద్ధం చేయాలి 

నాటేందుకు మొక్కలు సిద్ధం చేయాలి 

- Advertisement -

– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : వనమహోత్సవంలో భాగంగా గ్రామంలో నాటేందుకు మొక్కలు సిద్ధం చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని నాగాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని, ఉపాధి కూలీలతో మొక్కలు నాటేందుకు తవ్విస్తున్న గుంతలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురిస్తే అందించేందుకు, గ్రామంలో నాటేందుకు నిర్దేశించిన లక్ష్యం మేరకు నర్సరీలో మొక్కలను సిద్ధం చేయాలన్నారు.

గత వన మహోత్సవంలో నాటిన మొక్కలు చనిపోయిన, ఎండిపోయిన వాటి ప్రదేశంలో కొత్త మొక్కలను నాటించాలని ఈజిఎస్ సిబ్బందికి సూచించారు.  వర్షాకాలం ఆరంభమైనప్పటికిని వర్షం కురువని రోజున నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. మొక్కలు నాటే వరకు  ఉదయం సాయంత్రం వేళల్లో మొక్కలకు నీటిని అందించాలన్నారు.నర్సరీ నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ప్లాంటేషన్ ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంధ్య, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -