నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలోని చికాగోలో బుధవారం కాల్పులు కలకలం సృష్టించాయి. కాల్పుల్లో గాయపడిన అనేకమందిని అత్యవసర విభాగంలో చేర్చినట్లు నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ ప్రతినిధి క్రిస్ కింగ్ తెలిపారు. కాల్పులు జరిగిన కచ్చితమైన ప్రదేశం సహా ఎంతమంది గాయపడ్డారు వంటి పూర్తి వివరాలు తెలియాల్సి వుందని చికాగో పోలిస్ డిపార్ట్‌మెంట్ అధికారి జూలియో గార్సియా పేర్కొన్నారు. పూర్తి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు విడుదల చేస్తారని అన్నారు.
షికాగో పోలీసు విభాగం ప్రకారం.. దుండగులు అనేక వాహనాల్లో వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు జరుగుతోందని అన్నారు. గతంలో కూడా ఈ నైట్ క్లబ్ వద్ద కాల్పులు జరగగా.. అధికారులు క్లబ్ ను మూసివేశారని, ఇటీవలే తిరిగి ఆర్టిస్ లాంజ్‌గా తిరిగి ఓపెన్ చేశారని సమాచారం.