నవతెలంగాణ – పరకాల : జూలై 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగనున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల మండల, పట్టణంతో పాటు నడికూడ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చీట్ల సత్యనారాయణ,రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మోత్కూరి ధర్మారావు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జూలై 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగనున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళన బహిరంగ సభలో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. దేశంలోనే తొలిసారిగా గ్రామస్థాయి కాంగ్రెస్ అధ్యక్షులతో ఏఐసిసి అధ్యక్షుడు నేరుగా సమావేశం కానుండడం ఎంతో విశిష్టమైన ఘటనగా ఎమ్మెల్యే అభివర్ణించారు. సభకు హాజరయ్యే గ్రామ, మండల, నాయకులు సమన్వయంతో ముందుగానే రావాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుంకుమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, పాడి ప్రతాపరెడ్డి,పర్నం తిరుపతిరెడ్డి, మెరుగు శ్రీశైలం గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల చిన్ని, దాసరి బిక్షపతి, అల్లం రఘునారాయణ, మార్క రఘుపతి గౌడ్, నలబోలు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.