Friday, July 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుKCR: కేసీఆర్‌కు అస్వ‌స్థ‌త‌..

KCR: కేసీఆర్‌కు అస్వ‌స్థ‌త‌..

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం సాయంత్రం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. దీంతో డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, వారం రోజులుగా జలుబు, దగ్గు, తలనొప్పితోపాటు సీజనల్ జర్వం ఆయన్ని ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే గురువారం నాడు ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసానికి కుటుంబసభ్యులతోకలిసి కేసీఆర్ చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చేరారు. ఆయన వెంట సతీమణి శోభ, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌ ఉన్నారు.

మరికాసేపట్లో కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో.. సోమాజిగూడకు భారీఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. కాగా, యశోద ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -