నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : హమాలీ కార్మికుడు కిష్టయ్యకు న్యాయం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్ల నరేందర్ జిల్లా కలెక్టర్ కోరారు. గురువారం హమాలీ కార్మికుడు కిష్టయ్యను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ వలిగొండ మండలం శుంకిశాల గ్రామానికి చెందిన మొగిలిపాక కిష్టయ్య గత 18 సంవత్సరాలుగా వలిగొండ అగ్రికల్చర్ మార్కెట్ హమాలీగా పనిచేస్తుడు. గత నెల గోదాములో లారీ లోడ్ చేస్తుండగా భద్రతా లోపం కారణంగా లారీ పై నుండి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితుడు కిష్టయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యాడని వాపోయారు. కాగా ఈ విషయం జరిగి నెల రోజులు గడుస్తున్నపటికీ వలిగొండ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమానాయక్, సెక్రెటరీ, సూపర్ రమేష్, సివిల్ సప్లయర్ రెహమాన్, డిఎం హరికృష్ణలు ఇంత వరకు పట్టించుకున్న పాపానపోలేదని అన్నారు. నిరుపేద కుటుంబమైన కిష్టయ్యకు ఇప్పటి వరకు రూ.5 లక్షల వరకు ఖర్చు అయ్యిందని తెలిపారు. న్యాయబద్దంగా ఆయనకు రావాల్సిన ఇన్సురెన్స్ డబ్బులు, నష్టపరిహారం ఇప్పించి కిష్టయ్య కుంటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో కిష్టయ్య కుమారుడు మొగిలిపాక శివ, శుంకిశాల మాజీ సర్పంచ్ మొగిలిపాక నర్సింహ, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కిరణ్ మహారాజ్, శ్రీకాంత్ మహారాజ్, మహేష్, కృష్ణ, వెంకటేశ్ లు పాల్గొన్నారు.
హమాలీ కార్మికుడు కిష్టయ్యకు న్యాయం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES