Friday, July 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంచికాగోలో కాల్పులు..న‌లుగురు మృతి

చికాగోలో కాల్పులు..న‌లుగురు మృతి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: చికాగోలో నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మరణించారు. మరో 14మందికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు గురువారం తెలిపారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. చికాగోలోని రివర్‌నార్త్‌ పరిసరాల్లోని నైట్‌క్లబ్‌లో బుధవారం సాయంత్రం కాల్పులు జరిగాయి. ఒక రాపర్ ఆల్బమ్‌ విడుదల కోసం రెస్టారెంట్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు.

అదే సమయంలో లాంజ్‌ వెలుపల కాల్పులు జరిగినట్లు మీడియా నివేదించింది. బయట నిలబడి ఉన్న వారిపై వాహనంలో వెళ్తూ కాల్పులు జరిపారని, ఆ వాహనం వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయిందని పేర్కొన్నాయి. కాల్పుల్లో గాయపడిన అనేకమందిని అత్యవసర విభాగంలో చేర్చినట్లు నార్త్‌ వెస్ట్రన్‌ మెడిసిన్‌ ప్రతినిధి క్రిస్‌ కింగ్‌ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -