నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం లబ్దిదారులు ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నుకలిశారు. జిల్లా కేంద్రంలోని డివిజన్ నెంబర్ 17లో గల సర్వే నెంబర్ 168 లోని ఫూలే అంబేడ్కర్ నగర్ కాలనీలో గత రెండు నెలలుగా రేకుల షెడ్లు వేసుకొని పేదలు నివాసం ఉంటున్నారు. బిసి, ఎస్సీ,ఎస్టీ 80 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన నివాసంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఫూలే అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన పేదల తోపాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫూలే అంబేడ్కర్ నగర్ కాలనీ నాయకులు మేకల స్వామి, చంద్రా గౌడ్, కిషోర్, ఆశా బాయి, స్వాతి కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం టీపీసీసీ చీఫ్ ను కలిసిన ప్రజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES