నవతెలంగాణ – కమ్మర్ పల్లి : గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని నాగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మేస్త్రీలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని మేస్త్రీలకు సూచించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుంది అన్నారు.
ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. అంతకుముందు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు,, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మంగళవారం, శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES