Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలకు మైక్ సెట్ బహూకరణ

పాఠశాలకు మైక్ సెట్ బహూకరణ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర : మండలం లోని జెడ్పి హెచ్ ఎస్ పెద్దగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బహుకరించిన మైక్ సెట్ ను ఉపాధ్యాయులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రిటైర్డ్ ఉపాధ్యాయులు మారం రవీందర్ అన్నారు. పెద్ద గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 08 ఏండ్లు పనిన చేసి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. గురువారం తాను పనిచేసిన పాఠశాల కు తనకు గుర్తింపుగా రూ.20,000 విలువైన మైక్ సెట్ ను బహుకరించారు. ఈ సందర్బంగా మారం రవీందర్ మాట్లాడుతూ.. ఇది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ఉపయోకరంగా ఉంటుంని, ముఖ్యంగా పాఠశాల కార్యక్రమాలు, సమావేశాలు, ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలలో ఉపయోగపడుతుందని అన్నారు. ఇది పాఠశాల అభివృద్ధికి ఎంతో సహాయపడుతుందని అన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ రిటైర్డ్ ఉపాధ్యాయులు రవీందర్ ను ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు చిన నారాయణరెడ్డి, ఉపాధ్యాయులు రేపాల అశోక్, చంద్రశేఖర్, మధుబాబు, చంద్రకళ, జంగాల అరుణ, గ్రామస్తులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -