రజనీకాంత్ హీరోగా ‘కూలీ’ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ మరో కీలక పాత్రతో సర్‌ప్రైజ్ చేయబోతున్నారు.
అమీర్‌ఖాన్‌ని దహాగా పరిచయం చేస్తూ మేకర్స్ గురువారం ఫ˜స్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం ఉన్న గ్లాసెస్ ధరించి, సిగార్ తాగుతూ అమీర్‌ఖాన్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డి.సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్‌గా విడుదల చేయనుంది.
కలానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
‘కూలీ’లో దహాగా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES