Friday, July 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌కు ఖర్గే

హైదరాబాద్‌కు ఖర్గే

- Advertisement -

స్వాగతం పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కాంగ్రెస్‌ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులతో శుక్రవారం ఎల్బీస్టేడియంలో నిర్వహిస్తున్న సమ్మేళనంలో పాల్గొనేందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌ తదితరులు శంషాబాద్‌ విమానాశ్రయంలో పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాజ్‌ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు.
ఖర్గేను కలిసి ప్రముఖులు
ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను పలువురు ప్రముఖులు కలిశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్‌ జానయ్య, విద్యా కమిషన్‌ చైర్మెన్‌ ఆకునూరి మురళి కలిశారు. విద్యకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయనకు వివరించారు. మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌రెడ్డి, బాలునాయక్‌, రామ్మోహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు కూడా ఖర్గేను కలిశారు. ఆ తర్వాత కొండా మురళి దంపతులు కూడా ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -