Friday, July 4, 2025
E-PAPER
Homeజాతీయంబ్రిట‌న్ ఫైటర్ జెట్ త‌ర‌లింపున‌కు మాస్ట‌ర్ ప్లాన్..

బ్రిట‌న్ ఫైటర్ జెట్ త‌ర‌లింపున‌కు మాస్ట‌ర్ ప్లాన్..

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సాంకేతిక లోపంతో జూన్ 14న‌ కేర‌ళ తిరువ‌నంత‌పురంలో ఎయిర్ పోర్టులో బ్రిట‌న్ కు చెందిన ఫైట‌ర్ జెట‌ర్ అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయిన విష‌యం తెలిసిందే. అయితే నిపుణుల‌తో ప‌లు ప‌లుమార్లు ఆ పైట‌ర్ జెట్ కు మ‌ర‌మ్మ‌తులు చేసినా ఎటువంటి ప్ర‌యోజనం క‌లుగ‌లేదు. దీంతో అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ ను విడిభాగాలుగా చేసి బ్రిట‌న్ దేశానికి త‌ర‌లించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు.

రక్షణ రంగ నిపుణుల ప్రకారం.. ఈ జెట్‌ను C-17 గ్లోబ్‌మాస్టర్ III కార్గో విమానంలో తరలించే అవకాశం ఉంది. ఈ విమానంలోని వెడల్పు పరిమితి కారణంగా F-35 రెక్కలను విడదీయాల్సి ఉంటుంది. రెక్కలను సురక్షితంగా వేరు చేసి, జెట్‌ను కాంపాక్ట్ యూనిట్‌గా మార్చడం వల్ల మాత్రమే దానిని లోడ్ చేయడం సాధ్యమవుతుంది. దీని కోసం అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు ప్రత్యేకంగా పని చేస్తున్నారు. C-17 గ్లోబ్‌మాస్టర్ III కార్గో విమానం దాదాపు రెండు F-35B ఫైటర్ జెట్ లను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -