Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తాం 

సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తాం 

- Advertisement -

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ 
ఖర్గే మీటింగ్ కు తరలిన కాంగ్రెస్ శ్రేణులు 
నవతెలంగాణ – పెద్దవంగర
: కాంగ్రెస్ ను గ్రామ స్థాయి నుంచి సంస్థాగతంగా బలోపేతం చేస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్..కార్యక్రమంలో భాగంగా ఛలో హైదరాబాద్ కు తరలివెళ్లిన వాహనాలకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో కార్యకర్తలకు పార్టీ బలోపేతం పై కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారని తెలిపారు.

ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి మండలం నుండి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లినట్లు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పొడిశెట్టి సైదులు గౌడ్, రంగు మురళి, బానోత్ గోపాల్ నాయక్, ముత్యాల పూర్ణచందర్, దాసరి శ్రీనివాస్, బానోత్ సీతారాం నాయక్, అనపురం శ్రీనివాస్, వేముల వెంకన్న, బీసు హరికృష్ణ, ఎరుకల సమ్మయ్య, డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, గద్దల ఉప్పలయ్య, కాలేరు కరుణాకర్, జాటోత్ వెంకన్న, సుంకరి అంజయ్య, చిలుక దేవేంద్ర బెడద మంజూల, చిలుక సంపత్, పవన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -