నవతెలంగాణ – రాయపర్తి
నిరంతర ప్రజా సేవకుడు.. నిస్వార్థ నాయకుడు రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అని బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షుడు గూబ అశోక్ అన్నారు. శుక్రవారం ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వృద్ధులకు, ప్రయాణికులకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. నిస్వార్థ ప్రజా సేవకు నిలువెత్తు నిదర్శనం ఎర్రబెల్లి దయాకర్ రావు అని కొనియాడారు. ఆయన చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను ఆదుకోవడం ఎర్రబెల్లి నైజం అని తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, పార్టీ యూత్ నాయకులు చెడుపాక కుమార్, ఆశ్రఫ్ పాషా, సంకినేని ఎల్లస్వామి, చందు రామ్, చందు సతీష్, మండల శ్రీధర్, సుమన్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిరంతర ప్రజా సేవకుడు “ఎర్రబెల్లి”
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES