Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాణ్యమైన భోజనాన్ని అందించాలి: కలెక్టర్

నాణ్యమైన భోజనాన్ని అందించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి: విద్యార్థిని, విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని, నాణ్యమైన భోజనాన్ని వండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం  భువనగిరి పట్టణంలోని తెలంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ,హాస్టల్ ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్,హాస్టల్ యొక్క నిర్వహణ తీరును  సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.  

హాస్టల్ లో విద్యార్థులకి వండిన మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.  వండిన అన్నం, గుడ్లు, పెరుగు, కూరలు పరిశీలించారు. విద్యార్థులను భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.   ఈరోజు ఏం భోజనం పెట్టారు మెనూ పాటించారా లేదా అని విద్యార్థులను, ఉపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

మెనూలో ఉన్నది కాకుండా పిల్లలకు వేరేది వండి పెడితే కఠిన చర్యలు తప్పదన్నారు. విద్యార్థులకి పెట్టే భోజనంలో నాణ్యత సరిగా లేదని అన్నారు. విద్యార్థులకు వండే భోజనం నాణ్యత ప్రమాణాలు పాటించాలి అన్నారు. విద్యార్థులకి మెనూ ప్రకారం అందాల్సిన ఆహారం కచ్చితంగా పెట్టాలని, లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. చింతపండు నాణ్యత లేదని మార్చుకోవాల్సి సూచించారు. మెనూ సరిగా పాటించకపోతే వార్డెన్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  అధికారులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -